గురుకులాల్లో ప్రవేశాలకు పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేసేందుకు
ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రవేశానికి సంబంధించిన వాల్ పోస్టర్లను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విడుదల చేశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కమ్మదనం పాఠశాల ప్రిన్సిపల్ విద్యులత ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పోస్టర్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ మరియు జనరల్ గురుకులాల్లో 5వ తరగతి -ఎస్సీ, ఎస్టీ గురుకులాలలో 6 నుండి 9వ తరగతిలో ఖాళీల కొరకు, గౌలి దొడ్డి,అలుగునూరు సిఓఈ లల్లో 9తరగతి, రెసిడెన్షియల్, ఖమ్మం పరిగి లో 8 తరగతికి, రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లలో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ తో ప్రవేశపెట్టిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొండుర్గు ప్రిన్సిపల్ కుర్షిత్, ఉపాధ్యాయులు నర్మద, అనసూయ, స్వాతి, భూషణ్, మురళి తదితరులు పాల్గొన్నారు..