| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం

శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం


డైలీ భారత్, తిరుమల: పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కాసుల కోసం కక్కూర్తి పడి అడ్డంగా దొరికిపోయాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న పెంచలయ్య శ్రీవారి హుండీలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్‌ను దొంగిలించాడు.

పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కాసుల కోసం కక్కూర్తి పడి అడ్డంగా దొరికిపోయాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న పెంచలయ్య శ్రీవారి హుండీలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్‌ను దొంగిలించాడు. దాన్ని ట్రాలీలో దాచి పెట్టి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అతనిపై తిరుమల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేశారు.

ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు తిరుమల కొండపైకి చేరి శ్రీవారికి మొక్కులు చెల్లించుంటారు. స్వామివారి హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. అయితే పవిత్రక్షేత్రమైన తిరుమల వెంకన్న సన్నిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో అగ్రిగోస్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న పెంచలయ్య అనే వ్యక్తి శ్రీవారి హుండీలోని ఓ బంగారు బిస్కెట్‌ను మాయం చేశాడు.

దొంగిలించిన బంగార బిస్కెట్‌ను మూడో కంటకి తెలియకుండా ట్రాలీలో తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారుల కళ్లలో పడ్డాడు. పెంచలయ్య దొంగిలించిన గోల్డ్ బిస్కెట్ 100 గ్రాములు బరువు ఉన్నట్లుగా విజిలెన్స్ అధికారులు తెలిపారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై తిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గతంలో కూడా ఇలాంటి చోరీలు ఏమైనా చేశాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అతడ్ని విచారిస్తున్నారు.

Previous హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ
Next సంక్రాతి పండుగకి ఉరికెళ్తున్నారా... జాగ్రత్త పోలీస్ వారి సూచనలు పాటించండి
ADVERTISEMENT