డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం 2025 నూతన క్యాలెండర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో దుద్దిల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మా వంతు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని త్వరలో బ్రాహ్మణ సంక్షేమనికి మరిన్ని నిధులు సమకూరుస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్యాలెండర్ లో తిధి, వార, నక్షత్రాలతో పాటు సామాన్యులకు నిత్వకృత్యాలైన అనేక విషయాలను క్యాలెండర్ లో పొందుపరచడం అందరికి ఎంతగానో ఉపయోగమౌతుందని అన్నారు. బ్రాహ్మణులకు అన్ని విధాల తన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రిని వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు హర్కల వేణుగోపాల్ రావు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంగు రాఘవరావు,ఉపాధ్యక్షులు సంబరాజు రవి శర్మ, ప్రధాన కార్యదర్శి సృజన్ కుమార్, కోశాధికారి మోహన్ రావు, నవీన్, వెంకటసుబ్రహ్మణ్యం,ఏలేటి పవన్ కుమార్ శర్మ,గౌరారం అనిల్ కుమార్ సంబరాజు కిషన్ రావు, బ్రాహ్మణులు పాల్గొన్నారు..
News
బ్రాహ్మణ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు