| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎంపీ వద్దిరాజు ప్రకటన

ఎంపీ వద్దిరాజు ప్రకటన


డైలీ భారత్ ,భద్రాద్రి కొత్తగూడెం:బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంపై జరిగిన దాడిని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుందుడుకు చర్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ప్రతిపక్షాలకు చెందిన పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం హేయనీయమన్నారు.శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి వస్తాయని, తద్వారా తెలంగాణ అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు.ఇలాంటి అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలు,చర్యలకు వెంటనే స్వస్తి పలకాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రాజకీయ పక్షాలకు హితవు పలికారు.

Previous బంగారం, వెండి దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తులు
Next బ్రాహ్మణ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
ADVERTISEMENT