| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెరుగుతున్న నిఘా నేత్రం.. జనం భద్రం.. బాలానగర్ లో సీసీ కెమెరాలతో తగ్గుతున్న నేరాలు

పెరుగుతున్న నిఘా నేత్రం.. జనం భద్రం.. బాలానగర్ లో సీసీ కెమెరాలతో తగ్గుతున్న నేరాలు

బాలానగర్ ఏసీపీ హనుమంతా రావు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరధిలోని రాజు కాలిని ఇంటి యజమానులకు సీసీటీవీ అవగాహన కల్పించే సదస్సును బాలానగర్ సీఐ నర్సింహా రాజు ఆధ్వర్యంలో బాలానగర్ ఏసీపీ హనుమంతా రావు నిర్వహించారు. అదేవిధంగా బేతేసదా ప్రార్థన మందిరంలో ఇటీవల ఏర్పాటు చేసినా సీసీటీవీ కెమెరాలను ఏసీపీ హనుమంతా రావు, సీఐ నర్సింహా రాజు, ఎస్ఐ హాజీ మియాతో కలిసి ప్రారంభించారు. ఈ సదస్సుకు అనేక మంది ఇంటి యజమానులు హాజరయ్యారు. 

ఈ సందర్బంగా ఏసీపీ హనుమంతా రావు మాట్లాడుతూ, ప్రస్తుతం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో దోపిడీ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే విధంగా భద్రతాపరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరమని ఏసీపీ అన్నారు. ఈ సందర్భంలో ప్రతి ఇంటి యజమాని సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా భద్రతను మెరుగుపరచాలని సూచించారు.

అనంతరం సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ, “ప్రస్తుత పరిస్థితుల్లో అనుమానాస్పద వ్యక్తులు, సంఘవిద్రోహ శక్తులు స్థానికంగా సంచరిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండడం అవసరం అన్నారు. కెమెరాలు నేరస్థులపై గట్టి నియంత్రణ సాధించడానికి ముఖ్యమైన సాధనం” అని పేర్కొన్నారు. ఏమైనా అనుమానిత వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు డయల్ 100 లేదా 9490617444 సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పి. రవి కృష్ణ, గోపాల్, సత్యపాల్, కిషోర్ కుమార్, నయీమ్, పరంజ్యోతి, బెంజమిన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Previous కేటీఆర్ కు షాకిచ్చిన హైకోర్టు.. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు
Next కెపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ జెర్సీలను ఆవిష్కరించిన బీఆర్ఎస్ నాయకులు రవీందర్ యాదవ్
ADVERTISEMENT