షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆర్థిక సహాయంతో జెర్సీల అందజేత
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ క్రీడాకారులకే ప్రత్యేక గుర్తింపు ఉంటుందని బీఆర్ఎస్ యువనాయకులు మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో కొందుర్గు ప్రీమియర్ క్రికెట్ లీగ్ క్రీడాకారుల జెర్సీలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతుందని, నేటి తరం యువత క్రీడలతో పాటు చదువుల్లో రాణించాలని కోరారు. క్రీడల పోటీలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. గత కొన్నాళ్లుగా ప్రతి యేటా గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆదర్శనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాజీ ఎంపీటీసీ గోపాల్ పీఎ సీఎస్ డైరెక్టర్ జగదీశ్వర్ గౌడ్ బీఆర్ఎస్ యూత్ వింగ్ కంది రాఘవేందర్ గౌడ్, చీపిరి సాయి యాదవ్, గుడ్డు యాదవ్, కాట్న ఆంజనేయులు, దుమ్మని నవీన్, సాయి, సచిన్, ఆర్గనైజింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..