నర్సంపేట/నల్లబెల్లి - డైలీ భారత్: వరంగల్ సి పి ఆదేశానుసారం నల్లబెల్లి మండల పరిధిలో దసరా, సద్దుల బతుకమ్మ పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో నల్లబెల్లి ఎస్ఐ. ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గ్రామీణ సి ఐ మండలంలోని గ్రామ సర్పంచ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగల సందర్భంగా గ్రామాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు.
పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, యువత సహకరించాలని, పోలీసులకు సమాచారం అందించాలని సి ఐ ఎస్ఐలు కోరారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంటుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.