బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి కృషి : గౌరవరాజుల వెంకటేశ్వరరావు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :బ్రాహ్మణసేవా సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గౌరవరాజుల వెంకటేశ్వరరావు తెలిపారు.నూతన షాద్ నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా గౌరవరాజుల వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నియోజకవర్గంలోని
బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొని అధ్యక్షుడిగా గౌరవరాజుల వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గౌరవరాజుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఉన్న బ్రాహ్మణలు ఒకటై ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతీ సభ్యునికి అందేలా కృషి చేస్తానన్నారు.అందరి సమ్మతితో మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు..ఈ కార్యక్రమంలో చిలుకూరి రామసత్యనారాయణ శర్మ,విక్రమ్ శర్మ ,సుజివన్, భానుశర్మ, శ్రీనివాసాచార్య, మధుసూదనాచార్య, ఎం రఘునాథ్ శర్మ, వి.ప్రవీణ్, కమలకిషోర్ శర్మ, వంగిపురం ప్రవీణ్, వెంకటాచారి, రాజశేఖర శర్మ, రమాకాంత్, రఘుపతిరావు, మణి పంతులు, గజేంద్ర, ప్రకాష్ శర్మ, విఠల్ రావు,రాంకిషోర్, వికాష్ శుక్ల, మహావీర్ గౌర్, చింటూ, సునీల్ కుమార్, కిట్టు పంతులు, హర్ష,వాసుధర్, శ్రీకాంత్, శ్రీ హర్ష,నారాయణ రావు, నందకిషోర్, కె.రాజ్ కుమార్, ప్రమోద్, జ్యోతి, కమల టీచర్, సుజాత, వేదవతి, సౌమ్య, సంయుక్త తదితరులు పాల్గొన్నారు.