| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కారులో ఒక్కసారిగా మంటలు.. ముగ్గురు సజీవ దహనం

కారులో ఒక్కసారిగా మంటలు.. ముగ్గురు సజీవ దహనం

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తూ ముగ్గురు సజీవ దహనం అయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురూ చిక్కుకుపోయారు.

నగర శివారు ప్రాంతం ఘట్‌కేసర్‌ లో దారుణం జరిగింది. ప్రయాణిస్తున్న కారు లో ప్రమాదవశాత్తూ ముగ్గురు సజీవ దహనం అయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో సజీవ దహనం అయ్యారు. కారు నుంచి మంటలు రావడంతో స్థానికులు భారీగా గుమిగూడారు. కారులోని వ్యక్తుల ఆర్తనాదాలు విని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వాహనం వద్దకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులోని వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం : కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
Next బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా గౌరవరాజుల వెంకటేశ్వరరావు
ADVERTISEMENT