| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం : కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం : కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

రైతు భరోసా కింది రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం

ఏడాది కాలంగా రైతులకు బాకీ పడ్డ పైసలు తక్షణమే చెల్లించాలి

అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నేటికీ‌ రైతులకు భరోసా అమలు కాలే...

ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదు

కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్, కొత్తగూడెం : నాటి బిఆర్ఎస్ హయాంలో రైతును రాజును చేస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టిందని, రైతు భరోసా కింది రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి రూ.12వేలు మాత్రమే ఇస్తామని మోసం చేసిందని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నేటికీ ఆరు గ్యారంటీలు‌ అమలు కావడం లేదని, ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదని, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తామని కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ.. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.15వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అనేక వాగ్దానాలు చేసి, మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఆరో గ్యారెంటీ కింద ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేదంటే తన పదవికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌‌ను గెలిపిస్తే రైతు బంధు ఇవ్వరని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందే చెప్పారన్నారు. రైతు బంధును పూర్తిగా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. ఏడాది కాలంగా రైతులకు బాకీ పడ్డ రైతు భరోసాను తక్షణమే చెల్లించాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు.

Previous కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
Next కారులో ఒక్కసారిగా మంటలు.. ముగ్గురు సజీవ దహనం
ADVERTISEMENT