| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతీయ రోడ్డు భద్రత వార్షికోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన సదస్సు : సుజాతనగర్ ఎస్సై రమాదేవి

జాతీయ రోడ్డు భద్రత వార్షికోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన సదస్సు : సుజాతనగర్ ఎస్సై రమాదేవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్  రాష్ట్రీయ రహదారి రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు సుజాతానగర్ లో ట్రాలీ మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు  అవగాహన కార్యక్రమం నిర్వహించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ట్రాక్టర్లకు , ట్రాలీలకు రేడియం స్టిక్కర్లను అంటించడం జరిగింది.ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా  ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే విషయంలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. నిబంధనలు పాటించేవారు రోడ్లపై సురక్షితంగా ప్రయాణించగలరని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకూడదని, అలాగే చిన్నారులు, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సుజాతనగర్ ఎస్సై రమాదేవి సూచించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి ఏఎస్ఐ రాఘవులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా గౌరవరాజుల వెంకటేశ్వరరావు
Next విశ్వ హిందూ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు తుమ్మలపల్లి బ్రహ్మాజీ రంగు మాధవ చారి
ADVERTISEMENT