నేతన్నల మనో వికాస సదస్సులో చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం. సాగర్ పిలుపు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గణేష్ నగర్ లోని కార్మిక క్షేత్రంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ మనోవికాస సదస్సును ఏర్పాటు చేసినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మిట్టకొల సాగర్ హాజరై మాట్లడినారు.
కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అతి త్వరలోనే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికి చీరలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంవత్సరానికి రెండు చీరల పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. అట్టి ఆర్డర్ లను త్వరలోనే ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందివ్వనుందని తెలిపారు.
కార్మికులకు చేతి నిండా పని కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నదని తెలిపారు.
వస్త్ర పరిశ్రమను అభివృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూలు డిపోను ఇచ్చిందని గుర్తు చేశారు.
వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే పవర్ సబ్సిడీని కొనసాగిస్తుందని అన్నారు.
త్రిఫ్ట్, నేతన్న భీమ, యార్న్ సబ్సిడీ లాంటి పథకాలు కార్మికులను ఉద్ధేశించి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అన్నారు. ఇలాంటి పథకాల్లో ప్రతి కార్మికుడు చేరాలని కోరారు.
మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెను వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు. మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.
ఏటువంటి మానసిక సమస్య ఎదురైనా ధైర్యం కోల్పోకుండా మైండ్ కేర్ సెంటర్లోని సైకాలజిస్ట్ ను సంప్రదించి పరిష్కరించుకోవాలని కార్మికులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె.పున్నం చందర్, వస్త్ర పరిశ్రమ యజమానులు బండారి అశోక్, మంచే మల్లయ్య, బండారి వేణుగోపాల్, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, బుర శ్రీమతి, రపెల్లి లత, కొండ ఉమ, కార్మికులు పాల్గొన్నారు.