| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చైనాలో మరో వైరస్ కలకలం

చైనాలో మరో వైరస్ కలకలం

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. పెద్దయెత్తున ప్రజలు చైనాలో ఆసుపత్రిలో చేరుతున్నారు. శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు.

ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని తేలింది. అయితే మరోసారి ప్రపంచాన్ని చైనా వణికించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలోనే మరొక వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయ సమాజంలో కలకలం రేగుతుంది. ఊపిరి ఆడకుండా అనేక మంది ఆసుపత్రుల్లో చేరుతుండటంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది.

సోషల్ డిస్టెన్స్ ను కూడా..

చైనాలో మాస్క్ లను కంపల్సరీ చేసింది. అదే సమయంలో సోషల్ డిస్టెన్స్ ను కూడా మెయిన్ టెయిన్ చేయాలని సూచించింది. అత్యంత వేగంగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. చైనాలో మరోసారి కోవిడ్ 19 వైరస్ కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ అలెర్ట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమెర్జెన్సీని ఇప్పటికే ప్రకటించారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాడు కరోనా వైరస్ కూడా చైనాలో స్టార్టయి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. కోట్లాది మందికి వైరస్ సోకింది. లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుదేలైపోయింది. మరోసారి వైరస్ కలకలం రేగడంతో ఈ ఏడాది తొలి వారంలోనే ఈ వార్త విశ్వవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది.

Previous "ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి" : చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం. సాగర్
Next కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
ADVERTISEMENT