| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గొప్ప మహా నాయకుడు, మానవతావాది : సిఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గొప్ప మహా నాయకుడు, మానవతావాది : సిఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు… మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం అవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మృతిపై ఎక్సలో తన సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు.. నిర్ణయాల తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు..రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని సీఎం పేర్కొన్నారు.

Previous మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం : జె బి శౌరి
Next డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : తమిళ్ నాడు బీజేపీ చీఫ్ అన్నామలై
ADVERTISEMENT