సమగ్ర శిక్ష సిబ్బందికి టీపీటీఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిలుపు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సమగ్ర సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని రేపు హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు హాజరు కావాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు
సమగ్ర శిక్ష సిబ్బంది సమస్యలన్నింటిని పరిష్కరించి, 18 రోజులుగా వారు చేస్తున్న సమ్మెను విరమింపజేయాలని కోరుతూ రేపు ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో జిల్లా నుండి పెద్ద మొత్తంలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ధర్నా శిభిరంనుద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 23 ఏండ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష సిబ్బందికి కనీస వేతనం చట్టం అమలుజేసి, వారి సేవలను క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలి చాలని జీతంతో జీవితాలను వెళ్లదీస్తున్న వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, ఆరోగ్య కార్డులు అమలు చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కాంట్రాక్ట్ విదానాన్ని రద్దు చెసి, కనీస వేతనం అమలు చేయాలని, కెజిబివి ప్రత్యేక అధికారులకు ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతల నుండి తప్పించాలని, గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా అన్ని రకాల సెలవులు అనుమతించాలని, ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసే పద్ధతిని రద్దు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుమాల రామ్నాథ్ రెడ్డి, జిల్లా మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు