| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోక్సో కేసులో నిందితులకి ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు

పోక్సో కేసులో నిందితులకి ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అక్రమంగా సహజీవనం చేస్తున్న వివాహిత మహిళ మైనర్‌ కూతురిని బెదిరించి, బంధించి అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన  సంబంధించి పోక్సో చట్టం కింద నిందితులకి ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. నాగోల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ1 గోగు సురేష్‌(34) వోల్టూరు గ్రామం, వుప్పనూతల మండలం,నాగర్‌కర్నూల్‌, ఏ2గా పెంకుల లక్ష్మి,సాయినేజర్‌ కాలనీ,నాగోల్‌ వాసికి అండర్ సెక్షన్ 354,354-ఏ, 354-డి,344, 506 ఆర్/డబుల్ 34 ఐపిసి సెక్షన్ 11 ఆర్/డబుల్ 12 ఆఫ్ పోక్సో చట్టం నాగోల్‌ పోలీస్ స్టేషన్ ఎస్.సి నెం 591/2022 కేసు నమోదుకాగా, పోలీసులు విచారణ చేశారు.ఈ కేసులో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సునీత వాదనలు వినిపించారు.నిందితులుగా గోగు సురేష్‌, పెంకుల లక్ష్మి దోషిలుగా తేలడంతో రంగారెడ్డి జిల్లా ఎల్బినగర్‌ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి నిందితులుగా నిర్ధారించారు. ఈ కేసులో  నిందితులకి ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష,రూ.25000 జరిమానా మరియు బాధితురాలికి నష్టపరిహారం కింద మూడు లక్షల రూపాయలు అందచేశారు.

Previous జేఎన్టీయుహెచ్ జేఏసీ నూతన లోగో ఆవిష్కరణ
Next 69 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. 8 మంది స్మగ్లర్లు అరెస్ట్
ADVERTISEMENT