| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జేఎన్టీయుహెచ్ జేఏసీ నూతన లోగో ఆవిష్కరణ

జేఎన్టీయుహెచ్ జేఏసీ నూతన లోగో ఆవిష్కరణ

లోగోను ఆవిష్కరించిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ మంద రంజిత్ కుమార్..

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీ లో మంగళవారం నాడు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ మంద రంజిత్ కుమార్ కొత్తగా రూపొందించిన లోగోను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ లోగో విద్యా విలువలను ప్రతిబింబించేలా, ప్రతి అంశానికి ప్రత్యేకమైన అర్థంతో రూపకల్పన చేయబడిందని వివరించారు.

అలాగే ఈ జేఏసీ లోగో కమిటీ లక్ష్యాలను, అభివృద్ధి దిశలో దృక్పథాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుందని, ప్రతి రంగు మరియు రూపకల్పన విద్యా పురోగతికి సూచించేదిగా రూపొందించబడిందని తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొత్తూరు పవన్ కుమార్ తో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous సమగ్ర శిక్ష, URS, ఉద్యోగుల, ఉపాధ్యాయినిల సమ్మె కు TPTF మద్దతు
Next పోక్సో కేసులో నిందితులకి ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు
ADVERTISEMENT