బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
డైలీ భారత్, వేములవాడ :వేములవాడ మండలం రుద్రవరం, అనుపురం, నాంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గడపగడపకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాలను అమలు చేస్తామన్నారు. ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తానని, వేములవాడ పట్టణంలో మహిళా జూనియర్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు, చందుర్తిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. పది సంవత్సరాలు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, తెలంగాణ వ్యాప్తంగా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వేములవాడలో సైతం తాను గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు శ్రీనివాస్ చెప్పారు.
బైట్. ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వేములవాడ.