డైలీ భారత్, మహబూబాబాద్ జిల్లా:తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ IPS వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశం లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగి్ జీ పాటిల్ IPS మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి హాజరు అయి సమీక్షా లో పాల్గొన్నారు. ఈ సమీక్షా లో ఎన్నికల పై సమీక్షించారు.
ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికలు జరిగేలా చూడలని అన్నారు. పోలింగ్ బూత్ వద్ద పోలీస్ బందోబస్త్ వివరాల పై చర్చించారు.
అనంతరం లాంగ్ పెండింగ్ కేసులు,సైబర్ నేరాలు, ఇతర అంశాల గురించి చర్చించారు.
ఈ సమీక్షలో మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఎస్.బి ఇన్స్పెక్టర్ బాలాజీ వర ప్రసాద్, ఎలక్షన్ సెల్ మరియు ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్,డి. సి.ఆర్. బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాల్గొన్నారు.