| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ సొసైటీ ఎన్నికల్లో TBGKS అభ్యర్థి విజయకేతనం

సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ సొసైటీ ఎన్నికల్లో TBGKS అభ్యర్థి విజయకేతనం

వేముల శైలేష్ కిరణ్ డైరెక్టర్ గా ఎన్నిక

విజేత ను అభినందించిన ఎంపీ వద్దిరాజు

డైలీ భారత్, కొత్తగూడెం: సింగరేణికి చెందిన కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని  సెంట్రల్ వర్క్ షాప్ ఉద్యోగుల సహకార పొదుపు సంఘం ఎన్నికలు సోమవారం జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) అభ్యర్థిగా వేముల శైలేష్ కిరణ్ పోటీలో నిలిచారు. అందరి అంచనాలకు మించి ఎన్నికల్లో TBGKS అభ్యర్థి అత్యధిక మెజార్టీతో సొసైటీ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. వర్క్ షాప్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ గా ఎన్నికై గులాబీ జెండాను రెపరెపలాడించిన శైలేష్ కిరణ్ ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వారికి సొసైటీ ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఎంపీ రవిచంద్ర కోరారు.

Previous పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. 18.5 తులాల బంగారం దోపిడీ.
Next ఏసీబీకి చిక్కిన ఆర్డీవో కార్యాలయ సిబ్బంది
ADVERTISEMENT