డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది యజమాని శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భవనం మొదటి అంతస్తులో ఉంటున్న వారి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా, శ్రీనివాసరెడ్డి ఉదయం 8:30 కు ఇంటికి తాళం వేసి డ్యూటీ కి వెళ్ళాడు. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఒక రాడ్డు సహాయంతో తాళాన్ని బద్దలు కొట్టి బీరువాలో దాచి ఉంచిన 18.5 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. 100 కు డయల్ చేయగా పోలీసులు వచ్చి పరిసరాలను పరిశీలించి, క్లూస్ టీమ్ తో పరిశీలిస్తున్నారు...
News
పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. 18.5 తులాల బంగారం దోపిడీ.