కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..
డైలీ భారత్, గట్టు: గట్టు మండలం బోయలగూడెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి(గట్టు తిమ్మప్ప) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధ రాత్రి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంలో తిమ్మప్ప స్వామి ని పురవీధులలో ఊరేగారు.రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన రథోత్సవం వైభవంగా కొనసాగింది.. అంతకుముందు రథోత్సవం ముందు దంపతులచే హోమం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....