| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆలయ నిర్మాణానికి రూ.77777 విరాళంగా అందచేసిన శీలం శ్రీను,శీలం శ్రీకాంత్ సోదరులు

ఆలయ నిర్మాణానికి రూ.77777 విరాళంగా అందచేసిన శీలం శ్రీను,శీలం శ్రీకాంత్ సోదరులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఆధ్యాత్మికత అంటే ఏదైనా ప్రత్యేక సాధన కాదనీ ఇది ఒక నిర్దిష్ట మార్గం అనీ అక్కడికి చేరుకోవడానికి, చేయవలసినవి చాలా ఉన్నాయని అందులో ఆధ్యాత్మిక చింతన ఒకటని యువ నాయకులు శీలం శ్రీను, శీలం శ్రీకాంత్ బ్రదర్స్ వారి భక్తిని చాటుకున్నారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా జానంపేట గ్రామంలో హనుమాన్ మరియు శివాలయం నిర్మిస్తున్న దేవాలయాల పునర్నిర్మాణానికి శీలం శ్రీను, శీలం శ్రీకాంత్ సోదరులు 77,777/- రూపాయల విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ పెద్దలకు అందజేశారు. .ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేసిన శీలం సోదరులకి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.వారికి వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ.. శరీరం, మనస్సు, భావోద్వేగాలు మరియు శక్తులను ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వతకు పెంపొందించుకుంటే, మీలో ఇంకేదో వికసిస్తుంది - అదే ఆధ్యాత్మికత అని అన్నారు. మీ హేతువు అపరిపక్వంగా ఉన్నప్పుడు, అది ప్రతిదానిని అనుమానిస్తుందని, మీ హేతుబద్ధత పరిపక్వం చెందినప్పుడు, అది ప్రతిదీ పూర్తిగా భిన్నమైన కాంతిలో చూస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సృష్టిలో ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి మరొకటి లేదని అన్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో స్థానిక కమిటీ నాయకులు తదితరులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి తమ వంతు సాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు శీలం యాదయ్య, గుండు అశోక్, శీలం నర్సిములు, గుండు శివరాములు, కుర్వ మల్లేష్, చాకలి శేఖర్, చాకలి నర్సింహా, గుండు కుమార్, గుండు నవీన్, చెంద్రయ్య, మహేందర్, సాయి,భక్తులు తదితరులు పాల్గొన్నారు..

Previous ఆదివాసీ హక్కులను,చట్టాలను గిరిజనేతరులు కాలరాస్తే ఊరు కునే ప్రసక్తే లేదూ
Next కనుల పండువగా బోయిలగూడెం గట్టు తిమ్మప్ప స్వామి రథోత్సవం
ADVERTISEMENT