| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టీచర్లు లేరనే నిరసన వ్యక్తం చేసిన కస్తూరిబా గాంధీ విద్యార్థులు

టీచర్లు లేరనే నిరసన వ్యక్తం చేసిన కస్తూరిబా గాంధీ విద్యార్థులు

విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ఏఐఎస్ఎఫ్ నాయకులు

సమ్మె చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయమే

ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా*

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గూగులోతు వంశి

డైలీ భారత్, జూలూరుపాడ:జూలూరుపాడు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక పాఠశాల విద్యార్థులకు విద్యను బోధించే ఉపాధ్యాయులు పదవ తారీకు నుండి సమ్మెలో ఉండడం వల్ల విద్యార్థులకు ఎలాంటి తరగతులు జరగడం  లేదని పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడం వల్ల విద్యార్థులు అయోమయంలో  ఉన్నారని  అన్నారు . అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి నిరసన కార్యక్రమం చేస్తూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశి  మండల కార్యదర్శి sk చాంద్ పాషా మాట్లాడుతూ  గత 12 రోజులగా ఉపాధ్యాయులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకుండా  ఇక్కడ 6 వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ సమయంలో ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థిగా చదువుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  కేజీబీపీ ఉపాధ్యాయుల డిమాండ్స్ నాయమైనవే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే  ఉపాధ్యాయుల మరియు విద్యల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వంశి హెచ్చరించారు ఈ కార్యక్రమంలోమండల నాయకులు , అనిల్ బాలాజీ , సాయి తేజ  తదుపరులు పాల్గొన్నారు

Previous వైభ‌వంగా అభ‌య ఆంజ‌నేయస్వామి విగ్ర‌హ వార్షికోత్స‌వం
Next గోవుల అక్రమ రవాణాని అడ్డుకున్న విశ్వహిందూ పరిషత్-బజరంగ్దళ్ కార్యకర్తలు
ADVERTISEMENT