| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వైభ‌వంగా అభ‌య ఆంజ‌నేయస్వామి విగ్ర‌హ వార్షికోత్స‌వం

వైభ‌వంగా అభ‌య ఆంజ‌నేయస్వామి విగ్ర‌హ వార్షికోత్స‌వం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ మండ‌లం ఎర్రోనిగూడ గ్రామంలో ప్ర‌తిష్టించిన శ్రీ అభ‌య ఆంజ‌నేయస్వామి దేవాలయ విగ్రహ ప్ర‌తిష్టాప‌న ఏడోవ వార్షికోత్స‌వ వేడుకులను వైభ‌వంగా జ‌రుపుకున్నారు. శనివారం శ్రీ అభ‌య ఆంజ‌నేయస్వామి దేవాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ వార్షికోత్స‌వ వేడుకల్లో పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు.విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌డంతో ఎడోవ వార్షికోత్సవ వేడుక‌లు నిర్వ‌హించారు.ఆలయంలో విశేష హోమాలు, పూజా కార్యక్రమాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భ‌క్తులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చి ఆంజ‌నేయ స్వామికి పూజ‌లు నిర్వ‌హించి ద‌ర్శించుకున్నారు. భ‌క్తుల రాక‌తో ప్రాంగ‌ణమంతా ఆద్యాత్మిక వాతావ‌ర‌ణం నెల‌కొంది.ఈ కార్యక్రమంలో షాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ చెన్నయ్య, అశోక్, మాచన్ పల్లి రమేష్ గౌడ్ , పాండు, మహేందర్ గౌడ్, అన్వర్,సుభాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదయ్య, ప్రతాపరెడ్డి, మహేందర్ రెడ్డి, విక్రమ్, వినోద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...

Previous మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతి
Next టీచర్లు లేరనే నిరసన వ్యక్తం చేసిన కస్తూరిబా గాంధీ విద్యార్థులు
ADVERTISEMENT