డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా “ఇందిరమ్మ మహిళా శక్తి పథకం” లో మైనారిటీ మహిళల కు ఉచిత కుట్టు మిషన్ లు అందివ్వడం జరుగుతుందని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుండి 31.12.2024 వరకు మైనారిటీ మహిళలు ముస్లిం,సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సి కి చెందిన వారు tgobmms.cgg.gov.in ద్వార దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పథకంలో నిరుపేద,నిరాశ్రయులు,వితంతువు,విడాకులు అయిన మహిళలు, అనాధ, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకానికి కావలసిన జీరాక్స్ తెల తెల్ల రేషన్ కార్డు,ఆహారభద్రత కార్డ్ రెండూ లేకపోతే గ్రామీణ ప్రాంతం వారికి 1.50 లక్షలు, పట్టణ ప్రాంతం వారికీ రెండు లక్షలు మించకుండా ఆదాయ దృవపత్రం ఉండాలి.ఆధార్ కార్డు నివాస ధృవీకరణ ధ్రువీకరణ పత్రం వయస్సు 18 సం నుండి 55 సంవత్సరాలు ఉండాలని తెలిపారు. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వార నేర్చుకున్న టైలరింగ్ సర్టిఫికేట్ కనీసం 5వ తరగతి విద్య అర్హత కలిగి ఉండాలని తెలిపారు.అభ్యర్ధి సెల్ఫ్ డిక్లరేషన్ గడిచిన 5 సంవత్సరాల కాలములో తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి ఆర్ధిక, వస్తువులు లబ్ది పొందలేదు అని ఇవ్వాలి.ఆన్ లైన్ దరఖాస్తు తో పాటు పైన పేర్కొన ధ్రువ పత్రాలను జత చేసి రంగారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయమం రూమ్ నెం ఎస్-18, 2వ అంతస్తులో ఐడిఓసీ బిల్డింగ్, కొంగర కలాన్ నందు అందజేయాలని తెలిపారు.
News
ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లకు దరఖాస్తు చేసుకోవాలి