| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శాసనమండలిలో తన గళం విప్పిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

శాసనమండలిలో తన గళం విప్పిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

ఆశా వర్కర్లకు ఇస్తామన్న 18 వేల రూపాయల జీతం ఎక్కడ అని ప్రశ్న

ఆశా వర్కర్లపై దాడి చేసిన పోలీసులపై చర్యలు ఏవి?

గురుకుల పాఠశాల వసతి గృహాల పరిస్థితి మరీ దారుణం

వసతి గృహాల్లో ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం

ప్రభుత్వం సరైన భోజన సదుపాయం కల్పిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది

ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: క్రింది స్థాయి నుండి కష్టపడి పనిచేసి, కరోనా కష్టకాలంలో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఎంతో మందికి సేవలు అందించిన ఆశా వర్కర్ల పై పోలీసుల దాడి హేయమని ఇప్పటివరకు ఆ పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని శాసనమండలి సమావేశంలో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 18 వేల రూపాయల జీతం పెంపు హామీని నమ్మి, కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించి ఒక సంవత్సరం పాటు ఆశ వర్కర్లు ఎదురు చూసి, తమ గోడు విన్నవించుకుందామని తమపై అధికారి వద్దకు వెళితే దాడి చేసిన పోలీసులను ఇప్పటివరకు ప్రభుత్వం సస్పెండ్ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. ఎంతోమందికి సేవ చేసిన ఆశ వర్కర్లను గుర్తించి ఈరోజు జరగనున్న క్యాబినెట్ సమావేశంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం, మాటకు కట్టుబడి వాళ్ల జీతం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల వసతి గృహాల పరిస్థితులపై ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ గురుకుల పాఠశాల వసతి గృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ఎంతమంది పిల్లలు చనిపోతున్నారని, ప్రభుత్వం వాటిని పట్టించుకున్న పాపాన పోతలేదని, సరైన భోజన సదుపాయం కల్పిస్తే పాఠశాలల్లో ఇలా ఎందుకు జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవంటూ, విద్యా వ్యవస్థ పై ప్రభుత్వ పనితీరును సంవత్సరం కాలంగా గమనిస్తున్నామని, ఇలాగే జరిగితే గవర్నమెంట్ స్కూలు తీసివేయబడతాయని, ఇప్పటికే గవర్నమెంట్ స్కూలు తీసివేయబడుతున్నాయని ప్రభుత్వం తీసుకునే చర్యలు సభాముఖంగా తెలియజేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేయాలని, సంవత్సర కాలంగా ఎన్నో స్కూల్లో ఖాళీలు ఉన్నాయని వాటన్నింటిని గమనిస్తున్నామని, పాఠ్యాంశాల బోధనకు సంబంధించి వివిధ సబ్జెక్టులకు అసలు ఉపాధ్యాయులు ఉన్నారా లేరా అన్న విషయాన్ని ప్రభుత్వం గమనించడం లేదని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలపై మాకు ఎంతో గౌరవం ఉందంటూ, మరి వారిపై ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో తెలియజేయాలని ఈ సందర్భంగా శాసనమండలిలో మంత్రులను ప్రశ్నించారు. ఇంకా శాసనమండలిలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ షాద్ నగర్ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆరో మహాసభలకు తాను హాజరైనట్టు ఆ మహాసభలో తాను ఉపాధ్యాయుల సమస్యలను విన్నానని, సమస్యల పరిష్కారం కాకుంటే వారికి సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని ఈ సందర్భంగా శాసనమండలిలో తెలిపారు. 

Previous అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ చేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
Next భవిష్యత్ రాజకీయాలు యువతతోనే :మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ADVERTISEMENT