డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:అయ్యప్ప స్వాములకు నిత్య బిక్ష కార్యక్రమంలో భాగంగా సోమవారం శివ మారుతి అయ్యప్ప దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో స్వాములకు బిక్షా ప్రసాదాన్ని వితరణ చేశారు. ప్రతి యేటా వేలాది మంది అయ్యప్ప స్వాములకు నిత్య బిక్షను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు నిత్య బీక్ష నిర్వాహకుల పనితీరులను కొనియాడారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, మాజీ సహకార యూనియన్ చైర్మన్ రాజవరప్రసాద్, వెంకట్రాం రెడ్డి, రేటికల్ నందీశ్వర్, రఘునాథ్ యాదవ్, చెట్ల నరసింహా, లక్ష్మీనరసింహా రెడ్డి, చింటూ, సిద్దెల శ్రీనాథ్, సత్యనారాయణ, గుండు అశోక్, పులిజాల నవీన్, సందీప్ సింగ్, గుడ్డు యాదవ్, శీలం శ్రీకాంత్, తమకొండ రాజశేఖర్, కావలి అశోక్ యాదవ్, దుమ్మని నవీన్, నార్ల శ్రీనివాస్, రాఘవేందర్ గౌడ్, సాయి తేజ, జగన్ తదితరులు పాల్గొన్నారు..
News
అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ చేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్