సోనియానగర్ అక్రమ చర్చీ విషయంలో వేగంగా స్పందించిన అధికారులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రఖండ లోని సోనియానగర్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి చర్చి నిర్మించాలని ప్రయత్నించిన వారిని బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకుని, అక్రమంగా చర్చి నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిశంబరు 12 న స్ధానిక తహసీల్దారు కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయం లో ఫిర్యాదు(కంప్లైంట్) చేయటం జరిగింది, దీనిపై వేగంగా స్పందించిన మున్సిపల్ కమీషనర్ కె.సుజాత గారు ఈ రోజు ఉదయం సంబంధిత ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించడం జరిగింది, అనంతరం చర్చి ఫాస్టర్ పైన, చర్చి నిర్మాణానికి మట్టి తోలిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించడం జరిగింది, అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి గారు కూడా సంబంధిత స్థలాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించడం జరిగింది, వేగంగా స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిపై చర్యలు తీసుకున్నందు మున్సిపల్ కమీషనర్ గారిని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు గడిదేశి వెంకటేశ్వర్లు, గంగాధరి సీత, వింజమూరి మురళీ, శ్రీరామోజు మధుసూదన చారీ, భూక్యా మోహన్, దాసరి మాధవరావు, నూకల సతీష అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు దేశం కోసం ధర్మం కోసం దేశ సంపదను కాపాడటానికి ఎలాంటి ఆపేక్ష లేకుండా పనిచేయడానికి సిద్దంగా ఉంటారని జిల్లా కార్యదర్శి గంగాధరి సీత గారు తెలియజేశారు.