| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భూక్య నగేష్ స్వామిని అభినందించిన అన్నారుపాడు గ్రామ ప్రజలు

భూక్య నగేష్ స్వామిని అభినందించిన అన్నారుపాడు గ్రామ ప్రజలు

డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామపంచాయతీలో గత కొంతకాలంగా రామాలయం ఎదురుగా నిరుపయోగంగా ఉన్నటువంటి చేతి పంపు బోర్ ను ఈరోజు అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ భూక్య నగేష్ స్వామి తన సొంత ఖర్చులతో చేతిపంపు బోర్ ను బాగు చేపించి ఆదర్శంగా నిలిచారు. 

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ మంచి మనసుతో చేతి పంపు బోర్ ను బాగు చేపించిన భూక్య నగేష్ స్వామిని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Previous చౌడమ్మ గుట్టలో అయ్యప్పలకు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ
Next అక్రమ చర్చీ విషయంలో వేగంగా స్పందించిన అధికారులు
ADVERTISEMENT