| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీదేవి

జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీదేవి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ మరియు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 14వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కోర్ట్లలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది.ఇదివరకు కోర్ట్ ముందుకు రాని కేసులు కానీ కోర్ట్ లందు పెండింగ్ లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకునే/రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్‌ .లోక్ అదాలత్‌లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసు లోక్ అదాలత్‌కు పంపబడి, ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే, వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది. లోక్ అదాలత్ లో కేసు పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టే. ఈ లోక్ అదాలత్ ల ద్వారా సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది .ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీకి వీలున్న కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చు అని అన్నారు ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అని సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి అన్నారు.

Previous ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించండి : SI రమాదేవి
Next సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి : టిపిటీఎఫ్ పాతూరి మహేందర్ రెడ్డి
ADVERTISEMENT