టిపిటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా 23 ఏండ్లుగా సర్వ శిక్ష లో విధులు నిర్వహిస్తున్న వివిధ రకాల సిబ్బందికి సమాన వేతనం చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సర్వ శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద సర్వ శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ, శ్రమ దోపిడికి గురి అవుతున్న వీరికి సెలవులు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మినిమం టైం స్కేల్ వర్తింప జేయాలని, సర్వ శిక్షలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు క్రమబద్దీకరించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రతా కల్పించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న జిల్లా TPTF బాధ్యులు పాల్గొన్నారు.