| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కడజాతి నాయకులకు ఒక న్యాయం....అగ్రకుల నాయకులకు ఒక న్యాయమా

కడజాతి నాయకులకు ఒక న్యాయం....అగ్రకుల నాయకులకు ఒక న్యాయమా

కాంగ్రెస్ మైనారిటీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:కడజాతి నాయకులకు ఒక న్యాయం అగ్రకుల నాయకులకు ఒక న్యాయమా అని ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. గత పది ఏళ్లుగా నియంతృత్వ ధోరణి అవలంబించిన వెలమదొర కుటుంబానికి చెందిన దొరలను ఒకానొక సందర్భంలో మాట్లాడిన మాటలను ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చిత్రీకరించి షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరయ్య పై వెలమ కులస్తుల చేత బురదజల్లే ప్రయత్నం చేయడం పనికిమాలిన చర్య గా  తప్పుగా భావిస్తున్నాం. బిసి రజక కులానికి చెందిన ఓ పేదింటి బిడ్డ ఎమ్మెల్యే అయినందుకు అగ్రకులాల వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కావాలని అక్కసుతో గోరంతను కొండంత చేసి కడజాతి బిడ్డలను దూషిస్తే వేలమ అగ్రకుల అహంకారుల భరతం పడతాం. దీనివెనుక పెద్ద కుట్ర నే జరిగిందని భావిస్తున్నామని ఎంతటి వారినైనా వదిలేది లేదని ఎమ్మెల్యే పి ఏ కు ఫోను చేసి.ఎమ్మెల్యే శంకరయ్య పై దుర్భాషలాడిన వ్యక్తిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Previous బీసీ ఎమ్మెల్యేపై ఇన్ని కుట్రలా..?
Next రాజన్న సిరిసిల్లలో క్లాక్ టవర్ లో క్లాక్ ఎక్కడ
ADVERTISEMENT