షాద్ నగర్ కాంగ్రెస్ యువ నాయకులు అక్కిగారి శ్రీధర్
ఇది కచ్చితంగా వెలమ దొరలు కెసిఆర్, కేటీఆర్ పనే
యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డం పెట్టుకొని కేసిఆర్, కేటీఆర్ లాంటి దొరలు చేస్తున్న పని ఇదే
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను విమర్శిస్తే ఖబడ్దార్
మనోభావాలు మీ ఒక్కరికే తగలడ్డాయా..? ఇతరులకు ఉండవా..?
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో రజక కులానికి చెందిన బీసీ ఎమ్మెల్యే పై అధికారం కోల్పోయాక కూడా కొందరు వెలమ దొరలు ఇంకా అదే అహంకారంతో కుట్రలు చేస్తున్నారని షాద్ నగర్ కాంగ్రెస్ యువ నాయకులు అక్కిగారి శ్రీధర్ మండిపడ్డారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై బిఆర్ఎస్ ముసుగులో ఉన్న కొందరు వేలమ దొరలు చేస్తున్న దురాహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత పదేళ్ళలో బిఆర్ఎస్ హయంలో రెవెన్యూ, పోలీసు రాజకీయాన్ని చేతుల్లో పెట్టుకొని అమాయకులైన బీసీలు దళిత గిరిజనులను ఎంత దారుణంగా హింసించారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కేవలం యూట్యూబ్ ఛానల్ వక్రీకరించిన మాటలకు ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం దేనికని గత పదేళ్ళలో బీసీలు దళితులు గిరిజనులు అమాయక ప్రజలు నిరుపేదలు ఇబ్బందులు పడ్డప్పుడు ఈ వెలమలు ఎక్కడున్నారని అప్పుడు ఎందుకు రోడ్లపైకి రాలేదని ప్రశ్నించారు. దీన్ని మొత్తంగా కుట్ర కోణంగా చూస్తున్నామని అన్నారు. అసభ్య పదజాల పదాలు వాడుతున్న కొందరు వెలమ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయాలన్నారు..