డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ ఎంఎల్ఏ వీర్లపల్లి శంకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్,మహమ్మద్ ఇబ్రహీం తదితర నాయకులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగేపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ పార్టీ కొందూర్గు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి తదితరులను శాలువాలతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించి పార్టీ అభ్యున్నతికి ప్రభుత్వ సేవలకు తన వంతు కృషి చేస్తున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మరింత రాజకీయంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. సంబంధించిన వారిలో మహమ్మద్ ఇబ్రహీం, తంగేపల్లి శంకర్, కత్తి చంద్రశేఖరప్ప, ముబారక్ సయ్యద్ ఖదీర్ వీరముని యాదయ్య, చౌదరిగుడా మండల పార్టీ అధ్యక్షులు రాజు తదితరులు ఉన్నారు..
News
మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు