డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :ఫరూఖ్ నగర్ మండలం భీమారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి ఇటీవల పదవి విరమణ చేసిన చంద్ర రెడ్డి మరియు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు గౌరీ శంకర్, ప్రసన్న లక్ష్మి, నీల కృష్ణ టీచర్ లను ఘనంగా సన్మానించిన మండల విద్యాధికారి మనోహర్ , భీమారం మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ మండల ఉప అధ్యక్షులు వీరేశం గుప్త.పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఘనంగా బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఉపాధ్యాయులకు బదిలీ అనివార్యమే అని, ఉపాధ్యాయ జీవితంలో బదిలీలు అనేది సర్వసాధారణమని వారు ఎక్కడ పని చేసిన వారి సేవలు, జ్ఞాపకాలు మాత్రమే మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని,పనిచేసిన పాఠశాలలో విద్యార్థులతో తోటి ఉపాధ్యాయులతో మంచి పేరు తెచ్చుకున్న వారు చిరస్థాయిగా నిలిచిపోతారని, కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని విద్యార్థులు జీవితాంతం మర్చిపోరని,పాఠశాల అభ్యున్నతికి, విద్యార్థుల ప్రగతికి విశేష కృషి చేసిన వారి సేవలు మరువరాని వని, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించారని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను వారు అధిరోహించాలని, తమ విద్యాబోధన ద్వారా మరింత మంది విద్యార్థులకు సేవలు అందించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత ఉపాధ్యాయులు రాధిక,ఆల్బర్ట్ ,నాయకులు తల్ల ప్రశాంత్ గౌడ్ , విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు