డైలీ భారత్, హైదరాబాద్: ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. రిజిస్ట్రార్ ఒక ఆదర్శనీయమైన అడ్మినిస్ట్రేటర్‌గా, జేఎన్టీయూహెచ్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ప్రామాణికతతో మరియు సమర్థతతో పనిచేస్తున్నారు.
వారితో పాటు ఉన్న విద్యార్థులుగా, రిజిస్ట్రార్ పరిపాలనకు మేము ఎప్పుడూ మద్దతుగా ఉంటాము. వారి నాయకత్వంలో జేఎన్టీయూహెచ్ వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తుంది.
పత్రికా మిత్రులకు విజ్ఞప్తి
మీరు ప్రచురించే వార్తలు నిష్పాక్షికంగా మరియు నిజాలను మాత్రమే ప్రతిబింబించేలా ఉండాలి. అసత్య వార్తలు విశ్వవిద్యాలయ పరువును దెబ్బతీయడమే కాకుండా, అందరి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి, రిజిస్ట్రార్ పై వచ్చిన వార్తల వెనుక నిజానిజాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే రాయాల్సిందిగా మనవి చేస్తున్నాం.
హెచ్చరిక:
ఆసత్య ప్రచారాలు విశ్వవిద్యాలయం గౌరవానికి హాని కలిగిస్తాయి. ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం. జేఎన్టీయూహెచ్ విద్యార్థులుగా, రిజిస్ట్రార్ గారి పక్కన నిలుస్తున్నాము. కాబట్టి, అసత్య ప్రచారాలను వెంటనే ఆపాలని కోరుతున్నాం.