| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు "పూలే"

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

షాద్ నగర్ లో మహాత్మా జ్యోతిబా పూలే

హాజరైన మార్కెట్ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ "వీర్లపల్లి శంకర్"  కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మార్కెట్ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పిఎసిఎస్ చైర్మన్ చిట్టెం దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, రఘు, బాలరాజ్ గౌడ్, ఆంజనేయులు, సత్యం రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, బిసి సెల్ అధ్యక్షులు జాకారం చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు రాజు , మాజీ కౌన్సిలర్ విజయ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, కొత్తపేట ఉస్మాన్, నలమోని శ్రీధర్, లింగారెడ్డిగూడెం అశోక్, రావుల పెంటయ్య, పసుల బుచ్చయ్య, శేఖర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతిబాపూలే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడారని ఆయన అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడన్నారు. దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చని తెలిపారు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని ఆయన  మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులని, మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాల ద్వారా ప్రసిద్ది చెందారన్నారు. బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూనాలో ప్రారంభించారని ఆయన వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడన్నారు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి జంటగా ఈ దంపతులు నిలిచారని, విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా జ్యోతిరావు పూలే, తద్వారా తన సమాజం అభివృద్ధి సాధ్యమని ఫూలే భావించారని అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మారని వారి ఆశయాల సాధనలో తాము కూడా ప్రయాణిస్తామని అన్నారు..

Previous ఈనెల 29న దీక్షా దివస్ ను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
Next రామదండు ఆధ్వర్యంలో కార్తీకదీపోత్సవం
ADVERTISEMENT