| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రామదండు ఆధ్వర్యంలో కార్తీకదీపోత్సవం

రామదండు ఆధ్వర్యంలో కార్తీకదీపోత్సవం

డైలీ భారత్, దమ్మపేట: ది /27/11/2024 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట స్థానిక బంజారా కాలనీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం నందు రామదండు హిందూ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 365 కార్తీక దీపాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాయత్రి ఆశ్రమం గురువు  మూర్తి జి ( నాన్న) వచ్చి రామదండు వారు చేస్తున్న  కార్తీకదీపోత్సవ కార్యక్రమాలను గురించి వివరించి చెబుతూ రామదండు వారు కార్తీక మాసం మొదటి నుంచి దీపారాధన కార్యక్రమాలు మరియు  ఎస్సీ ఎస్టీ గ్రామాలలో దీపారాధన చేయనటువంటి గుడులు దగ్గర గ్రామస్తులను అందరినీ కలుపుకొని కార్యక్రమాలను కొనసాగించడం పిల్లలను కూడా  గుడికి తీసుకొని వచ్చి వారితో దీపాలు వెలిగించి పిల్లలను గుడికి అలవాటు చేయటం చాలా బాగుంది అని చెబుతూ ప్రతి గ్రామంలో సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ రామదండు వారు చాలా మంచి కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు కాబట్టే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ గుడికి రావడం నా అదృష్టం అంటూ రామదండు వారిని గురువు సనాతన ధర్మం యొక్క విశిష్టతల గురించి గ్రామ గ్రామానికి తెలియజేస్తూ మీరు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారి యొక్క ఆశీస్సులు మాకు అందించడం జరిగింది 

 ఈ దీపోత్సవానికి అయినా ఖర్చు మొత్తాన్ని రామదండు రాష్ట్ర అధ్యక్షులు గిద్ద కొండయ్య ఇవ్వడం జరిగింది 

 ఇలాగే మనం ఇంకా మరెన్నో కార్యక్రమాలను సనాతన ధర్మం కోసం జరుపుకోవాలని కోరుకుంటూ

ఇన్ని రోజులు మాకు సహకరించిన మాకు అండగా ఉండి గ్రామాలలో కార్యక్రమాలను నడిపించుకున్న గ్రామస్తులు అందరికీ రామదండు టీం కృతజ్ఞతలు తెలియజేస్తోంది 

రామదండు హిందూ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్ద కొండయ్య 9000327330

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండపల్లి నాగవర్ధిని

9989008731

Previous మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఇంజనీరు
ADVERTISEMENT