డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి, రజిత దంపతుల కుమార్తె వివాహం బుదవారం అంగరంగ వైభవం జరిగింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ అరీనా కళ్యాణమండపంలో జరిగిన జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రుత్విక రెడ్డి, అభిజిత్ రెడ్డిల వివాహానికి రాష్ట్ర ఐటీ శాఖ,రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతం ఇద్దరిని నిండు మనసుతో ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News
సీఎం సోదరుడి కుమార్తి వివాహానికి హాజరైన జిల్లా గ్రంథాలయం చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి