డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజంలో ఆలయాలతోనే ఆధ్యాత్మిక శోభ ప్రసరిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆయన ప్రత్యేకంగా పాల్గొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక టిఆర్ఎస్ యువ నాయకుడు గుట్ట రాజు నేతృత్వంలో అన్నదాన తదితర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు గ్రామస్తులకు భక్తులకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నదాన వితరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని అభినందించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తదితరులను ఘనంగా సన్మానించారు..
News
ఆలయాలతోనే ఆధ్యాత్మిక శోభ : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి