భక్తిశ్రద్ధలతో మహిళల పూజలు..
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని ప్రశాంత్ నగర్, సుభాష్ నగర్ కాలనీవాసులు కలిసికట్టుగా వనభోజనం మహోత్సవాన్ని ఇరుకాలనీల మధ్య గల పార్కులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వై .అంజయ్య యాదవ్ పూజా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.ఈ సందర్భంగా జరిగిన కార్తీక సమారాధన కార్యక్రమంలో కాలనీ మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి వనభోజనాలలో పాలుపంచుకున్నారు.
మంచి వాతావరణం..
కాలనీవాసులు ఎంత కలిసికట్టుగా అంత బలమని, రెండు కాలనీలవాసులు ఒకే జట్టుగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కాలనీలో జరిగిన వనభోజన మహోత్సవంలో పాల్గొన్న ఆయన కాలనీవాసులను అభినందించారు. కౌన్సిలర్ ఈశ్వర్ రాజు, ఇరు కాలనీల ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు..