33 జిల్లాలోని అన్ని పార్టీ కార్యాలయాల్లో దీక్ష దివస్
తెలంగాణ ఉద్యమ చరిత్ర పై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి...కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్
కాంగ్రెస్ కబంధ హస్తల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవటమే దీక్షా దివస్
రెండు జాతీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు కదం తొక్కుతాం.
దీక్షా దివాస్ కార్యక్రమ నిర్వహణ కోసం ఈ నెల 26 న అన్ని జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు
రంగారెడ్డి జిల్లా దీక్ష దివస్ ఇన్చార్జిగా మహమూద్ అలీ ఎమ్మెల్సీ
డిసెంబర్ 9 రోజు మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ
ఈ నెల 29 తేదీన బీఆర్ఎస్ దీక్షా దివస్
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్ అని, తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి...తెలంగాణ ఉద్యమ చరిత్ర పై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అంటూ, నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో తెలంగాణ బతుకు చిద్రమైందని, కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్ కనుక ఈనెల 29వ తేదీన 33 జిల్లాలోని అన్ని పార్టీ కార్యాలయాల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనంగా దీక్ష దివస్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...
స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం. ఆనాడు కేసీఆర్ సచ్చుడో...తెలంగాణ తెచ్చుడో అని తెగువ కనబరిచిన నాయకుడికి 3 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి...కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్. అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యింది. మళ్లీ ఈ రోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవే నిర్భంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితుల నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనిపిస్తున్నాయి. ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరుని మీద ఉన్నది. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చింది. ఒక్క వర్గం కాదు...సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారు. అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది...కాంగ్రెస్ కబంధ హస్తల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ తరుచూ చెప్పేది. ఈ రోజు ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, ఆ నాటి పాలనను కోరుకుంటున్నారు. దాని కోసం మా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సందర్భం.నవంబర్ 29 న 33 జిల్లాల్లో మా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నాం.తెలంగాణ పై కేసీఆర్ ఏ విధంగా చెరగని ముద్ర వేశారో మళ్లీ గుర్తు చేసుకుంటూ...రెండు జాతీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు కదం తొక్కుతాం.
29 నవంబర్ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదం తొక్కాలని పార్టీ నేతలకు పిలుపు ఇస్తున్నాం.
ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంఛార్జ్ లుగా నియమించాం. దీక్షా దివాస్ కార్యక్రమ నిర్వహణ కోసం ఈ నెల 26 న అన్ని జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తాం.29 నాడు దీక్షా దివస్ ఘనంగా నిర్వహించనున్నాం.కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9 రోజు మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. మా పార్టీ నాయకులంతా ఆరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతాం.కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఘనమైనది. ఆ రోజు నిమ్స్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది.అందుకే ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేసాం. దీక్షా దివస్ తో పాటు తెలంగాణ తల్లి విగ్రహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపు. ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీ లకు బుద్ది చెప్పాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.