| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ.

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

పెద్ద ఎత్తున హాజరైన మహిళలు విద్యార్థినిలు

బతుకమ్మ ఆటపాటలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ అనీ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో బుగ్గారెడ్డి గార్డెన్లో ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థినిలు హాజరయ్యారు.


ఈ కార్యక్రమానికి హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ ముదిరాజ్, కేశంపెట్ మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, మహిళ నాయకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ మహిళా సోదరీమణులతో బతుకమ్మ ఆటపాటల్లో పాలుపంచుకున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకురాలు నాగమణి, వర్ష లక్మన్ గౌడ్, రమాదేవి,యూత్ కాంగ్రెస్ నాయకులు సోలిపూర్ రాజేష్ గౌడ్, సాయి వంశీ, అర్జున్, నవీన్, ప్రదీప్,నరేందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు..

Previous కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next ఏసీబీకి చిక్కిన రహదారులు & భవనాల అధికారులు
ADVERTISEMENT