వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, బిజెపి నేత అందే బాబయ్యలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజానికి ఎవరైనా సరే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో అన్నారు. శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పద్మశాలి సంఘం నేతల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నేటి సమాజంలో సంకుచిత మనస్తత్వాలు, స్వార్ధాలు పెరిగిపోయాయని అన్నారు. ఆనాడు ఎంతో త్యాగనిరతితో పోరాటాలు చేసి నేడు ప్రజానీకానికి స్వేచ్ఛ లభించేలా చేసిన మహనీయుల వల్లనే ప్రశాంతంగా జీవిస్తున్నామని శంకర్ అన్నారు. రాజకీయాలు నేటి పరిస్థితుల్లో బ్రష్టు పట్టిపోయాయని, పాలకులు కూడా స్వార్థంతో ఆలోచించకుండా త్యాగ నిరతితో వ్యవహరిస్తే సమాజం బాగుపడుతుందని అన్నారు. సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దని జయంతి వేడుకల్లో పిలుపునిచ్చారు.
పద్మావతి అమ్మవారి ఆడపడుచులు పద్మశాలీలు - మాజీ ఎమ్మెల్యే బక్కని
పద్మశాలీలు శ్రీ పద్మావతి అమ్మవారి ఆడపడుచులేనని అందుకే వారిని పద్మశాలీలుగా అభివర్ణిస్తామని స్థానిక మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు తెలిపారు. ఈ అంశాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని గ్రంథాల్లో తను చదివినట్లు గుర్తు చేశారు. ఎంతో గొప్ప జాతిలో పుట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన చేసిన సేవ త్యాగాలే నేడు దేశానికి రాష్ట్రానికి ఆదర్శమైందని అన్నారు. ఇలాంటి మహనీయులను స్మరించడం ఎంతైనా సముచితమే అని అన్నారు.
ఆర్థిక రాజకీయ రంగంలో రాణించాలి - అందె బాబాయ్య
పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా విద్యా పరంగా ఎంతో రాణించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య ఆకాంక్షించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పద్మశాలీల తో చేనేత వస్త్ర రంగం ఎంతో సమాజానికి ఉపయోగపడుతుందని అన్నారు.
"చేనేత టవల్స్"తో ప్రముఖులకు సన్మానం
షాద్ నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో హాజరైన ప్రముఖులకు ప్రత్యేకంగా పద్మశాలీలు చేనేత టవల్స్ తో సత్కరించారు.
కోట జనార్దన్ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒగ్గు కిషోర్, ప్రధాన కార్యదర్శి చెన్నా బాలరాజ్, బాస రాజేందర్, నరేందర్, దాస రామెష్, ఎర్వ రమేష్, బుచ్చాయా, యాదగిరి, చెరుకు రాములు, మురళి, శ్రీనివాస్, నర్సిములు, ఆంజనేయులు వెంకుల్, ఇప్పలపల్లి లక్ష్మి, వరలక్ష్మి, కీర్తన, రుద్ర శారద, రమ్య, మేక అరుణ తదితరులు చేనేత వస్త్రాలతో ప్రముఖులను సత్కరించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, చెంది తిరుపతి రెడ్డి, బాలరాజు గౌడ్, కొంకల్ల చెన్నయ్య, దంగు శ్రీనివాస్ యాదవ్,అగ్గనుర్ బస్వం అప్పా, హరినాథ్ రెడ్డి,కొమ్ము కృష్ణ, జాంగారి రవి, ముభారక్ ఖాన్, దాకం మనీష్ కుమార్, బాలు నాయక్, శ్రీనివాస్ యాదవ్ , బచ్చలి నరేష్, లింగారెడ్డి గూడ అశోక్, పద్మశాలి సంఘం నేతలు జనార్దన్, వగ్గు కిషోర్, అదెట్ల రాజు తదితరులు పాల్గొన్నారు..