డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలుగు సాహిత్యంలో కవులు రచయితలను ప్రోత్సహిస్తున్న జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరమ్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ సారధ్యంలో ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ ( విశిష్ట సాహితీమూర్తుల సంగమం ) గా కొనసాగుతున్న సంస్థకు కార్యనిర్వాహక సభ్యులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కవయిత్రి టీ.వసంతా లక్ష్మణ్ ను నియమిస్తున్నట్టు సంస్థ అధ్యక్షులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలలో ఉత్సాహంగా ముందుకు సాగాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా అనేక ప్రాంతాల నుండి తెలుగు రచయితలను ప్రోత్సహిస్తూ సమూహంగా విశిష్ట సేవలు అందిస్తున్నదని, కథా సమయం, ఉత్తమ కవిత శీర్షికలతో పలు కార్యక్రమాలు నిర్వహించామని సంస్థ ప్రధాన కార్య నిర్వహకులు కందాళ పద్మావతి, కట్టెకోల విద్యుల్లత, తేరాల సాధనలు వసంతా లక్ష్మణ్ కు అభినందనలు తెలియజేశారు.
News
"విశిష్ట సాహితీమూర్తుల సంగమం" కార్యనిర్వాహక సభ్యులుగా కవయిత్రి టీ.వసంతా లక్ష్మణ్ కు బాధ్యతలు