బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ఎంపీ డీకే అరుణకు వినతి పత్రం అందజేత
సానుకూలంగా స్పందించిన ఎంపీ అరుణ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎంఎంటిఎస్ రైలును శంషాబాద్ నుండి షాద్ నగర్ వరకు పొడిగించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీడీకే అరుణను కోరారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను మంగళవారం మహబూబ్ నగర్ లో వారి స్వగృహంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంఎంటిఎస్ రైలు శంషాబాద్ వరకు నడవడం వల్ల షాద్ నగర్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి
ఎమ్ ఎమ్ టి ఎస్ రైలు షాద్ నగర్ వరకు పొడుగించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీ అరుణమ్మకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎంఎంటిఎస్ రైలు షాద్ నగర్ కు రావడం ద్వారా చిరు వ్యాపారులు, ఉద్యోగస్థులకు, విద్యార్థులు, రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఆర్టీసీ బస్సులు షాద్ నగర్ లోపలికి రావడం లేదనీ రైలు షాద్ నగర్ వరకు నడిపితే అతి తక్కువ చార్జీతో షాద్ నగర్ ప్రజలకు ఎంతో ప్రయోజనం అని అన్నారు. ఎంఎంటిఎస్ ద్వారా షాద్ నగర్ నుండి రోజు 5 వేల మంది ప్రయాణం చేస్తారన్నారు. అలాగే హంద్రీ ఎక్స్ ప్రెస్ మలక్ పేటలో ఆపే విదంగా చూడాలని కోరారు.
హంద్రీ ఎక్స్ ప్రెస్ మలక్ పేటలో ఆపడం వల్ల షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలకు, జడ్చర్ల, గద్వాల్ ప్రజలకు ఎంతో ప్రయోజనం అని అన్నారు. పై విషయాలపై ఎంపీ అరుణమ్మ స్పందిస్తూ రైల్వే మంత్రి దృష్టికి తీసుకెల్తానని
సానుకూలంగా స్పందించారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి వెంట బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, చేగు సుధాకర్, మల్లేష్ తదితరులు ఉన్నారు..