| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేడు ఎమ్మార్పీఎస్‌ విశ్వరూప సభకు ప్రధాని రాక

నేడు ఎమ్మార్పీఎస్‌ విశ్వరూప సభకు ప్రధాని రాక

వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం..

డైలీ భారత్, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొననున్నారు..

శనివారం సాయత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని.. సభలో పాల్గొని అనంతరం ఆరుగంటలకు దిల్లీ వెళ్తారు. ఈ సభలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొననున్నారు. "సమగ్ర న్యాయానికి నాంది దండోరా..చలో హైదరాబాద్‌" నినాదంతో, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ విశ్వరూప సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సభలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు

Previous చంద్రమోహన్ ఇకలేరు
Next గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
ADVERTISEMENT