Posted on 2023-11-10 18:45:02
డైలీ భారత్, సిరిసిల్ల :శుక్రవారం సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ప్రజా ఆశీర్వాద పాదయాత్రలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం 3:30 నిమిషాలకు హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరిన ఆయన రగుడు పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒకవైపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ 50 లక్షల సొమ్ముతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి నాపై పోటీ చేస్తాడా అని కేసీఆర్ అంటున్నడని, మరోవైపు ఎంపీ టిక్కెట్లు అమ్ముకున్న సన్నాసి కేసీఆర్ నాపై పోటీ చేస్తాడా అని రేవంత్ రెడ్డి అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పద్ధతిని చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థులు ఎంత అవినీతిపరులో అర్థమౌతుందన్నారు. అదే బీజేపీకి అవకాశమిస్తే ఏ అవినీతి ఆరోపణల్లేని పేద నాయకుడు సీఎం అవుతారని తెలిపారు. ఇక్కడున్న షాడో సీఎం సిరిసిల్లను చాలా అభివృద్ధి చేసినని గొప్పలు చెప్పుకుంటున్నడని, పట్టుమని పది చినుకులు పడితే సిరిసిల్ల మునిగిపోతోందన్నారు. కమీషన్లు, కాంట్రాక్టులు దొబ్బడంలో వీళ్లను మించినోళ్లు లేరని, సిరిసిల్ల కొత్తచెరువు lను ఆధునీకరణ పేరిట సగం వరకు పూడ్చి వేసి శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, సంజీవయ్య నగర్, అనంత్ నగర్ సర్దార్ నగర్ లను వరదలో ముంచుతున్నడని మండిపడ్డారు. బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాలను ఆగం చేశాడని, కేవలం పదిమంది ఆసాములు మాత్రమే బతుకమ్మ చీరలతో లబ్ధి పొందుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో కొడుకు సీఎం అయితే ఇక్కడ సామంత రాజుల పాలన సాగుతోందని, మండలానికి ఇద్దరు ముగ్గురు సామంత రాజులు నియోజకవర్గాన్ని దోచుకుంటారని అన్నారు. బిజెపి కార్యకర్తలను అరెస్టు చేసి సిరిసిల్లలో తిరుగుతున్నాడని, పోలీసులు సైతం ప్రశ్నించే బీజేపీ నాయకులపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నరని, పోలీసులు ఇట్లనే చేస్తే సిరిసిల్లకు వచ్చి ఇక్కడే కూర్చుంటానని ద్వజమెత్తారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో దమ్ము చూపిన కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు. బీజేపీ ప్రజల్లో గుండెల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటూ, రాక్షస పాలన కొనసాగిస్తోందని, తెలంగాణ ప్రజలకు విముక్తి చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం తనను ఆదేశించిందన్నారు. అందుకే 50 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన యుద్దం చేసి, జైలుకు వెళ్లానని, 40 లక్షల మంది రైతుల పక్షాన ఉద్యమించి లాఠీదెబ్బలు తిన్నానన్నారు. జీతాలు రాక 317 జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగుల పక్షాన యుద్దం చేసి జైలుకు వెళ్లానని, రైతుల పక్షాన ఉద్యమించి రక్తం చిందించినట్లు గుర్తుచేశారు. కేటీఆర్ నువ్వే సీఎం అనుకుంటున్నవ్ కదా... నీకు దమ్ముంటే మీ అయ్య నిన్ను సీఎంగా ప్రకటించమనమని సవాలు విసిరారు. సిరిసిల్లలో ఎంత మందికి ఉద్యోగాలు, ఎంత మందికి నిరుద్యోగ భ్రుతి, ఎంత మంది లక్ష రూపాయల రుణమాఫీ, చేశావో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాలు విసిరారు. కేటీఆర్ సిరిసిల్లాకు చేసిందేమీ లేదని, సీఎం కొడుకువి కాకుంటే నిన్ను కుక్కలు కూడా దేఖవని ఎద్దేవా చేశారు. బిచ్చపు బతుకు నీది. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని, కులం కంటే గుణం ముఖ్యమని కేసీఆర్ అంటూ కులాలను అవమానిస్తున్నడన్నారు. బీసీ సీఎం అయితే పేద, బడుగు, బలహీనవర్గాల జీవితాల బాగుపడుతాయని చెప్పారు. సిరిసిల్లలో రాణిరుద్రమను చూస్తే కేటీఆర్ కు వణుకు పుడుతోందని, ఈసారి ఆమె గెలుపు ఖాయమని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, ఆమెను సిరిసిల్ల ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. బండి సంజయ్ సిరిసిల్లకు రావడంతో నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >