Posted on 2023-11-10 10:14:13
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాసన సభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు భద్రతపరంగా చేయవలసిన ఏర్పాట్లును జిల్లా ఎన్నికల పరిశీలకురాలు వినిత సాహు ఐపీఎస్ ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సందర్శించి భద్రత ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సమీక్షించారు ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ....
సిరిసిల్ల , వేములవాడ లలో స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రంల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నీడలో, కేంద్ర, జిల్లా బలగాలతో పకడ్బంది నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు వేసుకునేలా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడ నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ తో కలసి సందర్శించారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల, వేములవాడ లోని నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్త్,భద్రత ఏర్పాట్లు ను జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకురాలు వినిత సాహు ఐపీఎస్ ఎం,గారికి వివరించారు.అనంతరం నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు.పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు నేరుగా ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను మొబైల్ నెంబర్ 8121258834 కు ఫోన్ చేయవచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్ తెలిపారు.
వీరి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, ఆర్.ఎస్.ఐ జునైద్ ఉన్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >